Search
Close this search box.

  రేపటి నుంచే WPL 2025 టోర్నీ..!

ఇండియాలో మరో టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి.. అంటే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL టోర్నమెంట్ 2025 ( Women’s Premier League ) ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు… భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) అన్ని ఏర్పాట్లు చేసేసింది. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో… ఏకంగా ఐదు జట్లు పాల్గొనబోతున్నాయి. 2024 సంవత్సరం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( Women’s Premier League ) ఛాంపియన్గా నిలిచిన… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB )… తన టైటిల్ ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగబోతుంది.

 

అటు మిగతా జట్లు కూడా ఈసారి మంచి ప్రదర్శన కనబరిచి టైటిల్ నెగ్గాలని డిసైడ్ అయిపోయాయి. ఇక ఒకసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ పరిశీలిస్తే… రేపు గుజరాత్ జేయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రేపు రాత్రి 7:30 గంటలకు వడొదర వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది.

 

2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో… గుజరాత్ జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా మొదటి స్థానంలో ఉంది. అంటే చాంపియన్గా నిలిచింది అనమాట. దీంతో ఈ రెండు జట్ల మధ్య… మొదటి మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇలా గ్రూప్ స్టేజ్లో ఏకంగా 20 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మార్చి 15వ తేదీన… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( Women’s Premier League ) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది.

 

Wpl టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?

 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గతంలో లాగానే… జియో సినిమా ఆప్ లో చూడవచ్చు. లేదా స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ద్వారా మనకు లైవ్ అందుబాటులో ఉంటుంది. వీటిలో… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే జియో సిమ్ మాత్రం కచ్చితంగా ఉండాలి. జియో కస్టమర్లకు మాత్రమే… ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మ్యాచ్ లు అన్ని… రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. టి20 ఫార్మాట్ కావడంతో… రాత్రి 11 గంటల సమయానికి మ్యాచులు పూర్తి అవుతాయి.

 

ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం నాలుగు స్టేడియాలను సిద్దం చేశారు. వడోదర లో కొటంబి స్టేడియం… అలాగే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం వాడుకోనున్నారు. అలాగే లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియం… ముంబైలోని బ్రా బోర్న్ స్టేడియాలను ఈ టోర్నమెంట్ కోసం వాడుకోనున్నారు. ఫైనల్ మ్యాచ్ మార్చి 15వ తేదీన జరిగితే ఎలిమినేటర్ మ్యాచ్ 13వ తేదీన ఉంటుంది. ఈ టోర్నమెంట్ మొత్తం 22 మ్యాచ్లతో ముగియనుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు