మార్చి17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో 28,963 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటర్ రావు తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.మార్చి17 నుంచి 28 వరకు ఓపెన్ ఎస్ఎస్‌సీ,మార్చి3 నుంచి 15 వరకు ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయన్నారు.
