Search
Close this search box.

  హాట్‌టాపిక్‌గా మారిన మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యలు..!

February 12, 2025 11:12 AM | Aditya369 News

హాట్‌టాపిక్‌గా మారిన మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యలు..!

మా ఇంట్లో ఆడపిల్లలందరినీ చూస్తుంటే.. మా ఇల్లు లేడీస్‌ హాస్టల్‌లా.. నేను వాళ్లకు వార్డెన్‌లా అనిపిస్తాను. అందుకే రామ్‌చరణ్‌ మళ్లీ ఆడపిల్లను కంటాడేమో అని భయమేసి.. ఒక మగ పిల్లాడిని కనరా.. మన లెగసిని కంటిన్యూ చేస్తాడు అన్నాను' అని అగ్ర నటుడు చిరంజీవి అన్నారు. మంగళవారం జరిగిన 'బ్రహ్మా ఆనందం' ప్రీరిలీజ్‌ వేడుకలో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అంతేకాదు, చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలపై కొంతమంది మహిళలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి పబ్లిక్‌ ఫంక్షన్స్‌లో ఇలా మాట్లాడటం సరికాదని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన 'బ్రహ్మా ఆనందం' ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, యాంకర్‌ సుమ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. అయితే మెగాస్టార్ ఈ మాటలు కేవలం ఇంట్లో తన మనవరళ్లతో తన పరిస్థితి గురించి చమత్కారంగా అన్నారే తప్ప ఆయన మహిళలను ఎంతో గౌరవిస్తారని, అది ఆయన అభిప్రాయం కాదని చాలామంది అంటున్నారు.

మా ఇంట్లో ఆడపిల్లలందరినీ చూస్తుంటే.. మా ఇల్లు లేడీస్‌ హాస్టల్‌లా.. నేను వాళ్లకు వార్డెన్‌లా అనిపిస్తాను. అందుకే రామ్‌చరణ్‌ మళ్లీ ఆడపిల్లను కంటాడేమో అని భయమేసి.. ఒక మగ పిల్లాడిని కనరా.. మన లెగసిని కంటిన్యూ చేస్తాడు అన్నాను’ అని అగ్ర నటుడు చిరంజీవి అన్నారు. మంగళవారం జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్‌ వేడుకలో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అంతేకాదు, చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలపై కొంతమంది మహిళలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి పబ్లిక్‌ ఫంక్షన్స్‌లో ఇలా మాట్లాడటం సరికాదని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, యాంకర్‌ సుమ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. అయితే మెగాస్టార్ ఈ మాటలు కేవలం ఇంట్లో తన మనవరళ్లతో తన పరిస్థితి గురించి చమత్కారంగా అన్నారే తప్ప ఆయన మహిళలను ఎంతో గౌరవిస్తారని, అది ఆయన అభిప్రాయం కాదని చాలామంది అంటున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore