చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాని దాడి దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.ఈ ఈ దాడి ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాదని, ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు.కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపా డేందుకు తపిస్తు పోరాటం చేస్తున్నారన్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిదాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు తేల్చాలన్నారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు.
