పిఠాపురం లో రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో జరుగుతున్న గత మూడు రోజులుగా జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాల బాలికల బాస్కెట్ బాల్ పోటీల్లో వివిధ జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.వీటిలో బాలికల విభాగంలో తూర్పుగోదావరి, అనంతపురం, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల జట్లు,బాలుర విభాగంలో తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,చిత్తూరు,కృష్ణ మొత్తం 8 జిల్లాల జట్లు సెమి ఫైనల్స్ కు చేరుకున్నాయి.
