గొల్లప్రోలులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు ఎస్ఐ ఎన్ రామకృష్ణ సిబ్బందితో కలిసి గొల్లప్రోలు శివారు ఏలేరు పంట కాలువ కాలువ గట్టుపై పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి రూ1,78,840 నగదును స్వాధీనం చేసుకున్నారు.వీరిపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులుతెలిపారు.









