సినీ నటుడు స్టార్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణ లో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని కోరారు.
రోడ్డు విస్తరణలో తన ప్లాటుకు చెందిన భూమిలో ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 30 అడుగులు భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను చంద్రశేఖర్ రెడ్డి కోరారు.
రూ 1100 కోట్లు ఖర్చుతో కేబీ ఆర్ పార్కు సమీపంలోని కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల పరిధిలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాసుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.దీని వలన పార్క్ చుట్టూ, సమీపంలో జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ చిక్కులతోపాటు యూటర్న్ లకు అవకాశం లేకుండా సాఫీగా ప్రయాణాలు సాగుతాయి.
అయితే, కేబీఆర్ పార్క్ చుట్టూ100 ఫీట్ల రోడ్డును రూ120 ఫీట్లకు విస్తరించడానికి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ చేశారు.ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో భాగంగా సినీ హీరో బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి,చంద్రశేఖర రెడ్డిలతో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు,బడా వ్యాపారులకు సంబంధించిన స్థలాలు భూసేకరణలో ఉన్నాయి.
ఈ క్రమంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణ పై పునరాలోచన చేయాలని ఆయన అధికారులను కోరారు.