పంచారామ క్షేత్రం అయిన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ వి. సతీష్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఐఓసీ డైరెక్టర్ కుటుంబానికి ఆలయ కార్యనిర్వహణాధికారి ಬಲ್ಲ నీలకంఠం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. భీమేశ్వర స్వామిని, బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సతీష్ కుమార్ దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ నంది మండపంలో అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, దత్తు శర్మ వేద పండితులు సోమేశ్వర శర్మ, సతీష్ కుమార్ కుటుంబానికి పండితశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.









