Search
Close this search box.

  మేకిన్ ఇండియాతో పెద్దగా ఒరిగిందేమి లేదు.. లోక్ సభలో రాహుల్ సంచలన వాఖ్యలు..

February 4, 2025 8:20 AM | Aditya369 News

మేకిన్ ఇండియాతో పెద్దగా ఒరిగిందేమి లేదు.. లోక్ సభలో రాహుల్ సంచలన వాఖ్యలు..

దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని.. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యకు సరైన పరిష్కారం చూపించలేరపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన రాహుల్.. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరించిందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలు ఏమీ లేవని.. అది ప్రభుత్వ విజయాల జాబితా లాగా ఉందన్నారు.

మేకిన్ ఇండియా గురించి ప్రస్తావిస్తూ.. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై చైనాకు అప్పగించామని ఆరోపించారు. మేకిన్ ఇండియా మంచి ఆలోచనే.. కానీ దానిని అమలు చేయడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. మేకిన్ ఇండియాతో పెద్దగా ఒరిగిందేమీ లేదని అన్నారు.

తయారీ రంగం 60 ఏళ్లలో కనిష్ట స్థాయిలో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఫోన్ చూపించి ఇది ఇండియాలో తయారు చేయబడిందని మనం చెబుతున్నప్పటికీ, దాని భాగాలు చైనా నుండి వచ్చాయని, దానిని ఇక్కడ అసెంబుల్ చేశామని అన్నారు. ప్రపంచం పూర్తిగా మారుతోందని ఆయన అన్నారు. మనం పెట్రోలియం నుంచి బ్యాటరీలు,అణుశక్తి వైపు వెళ్తున్నామని, అంతా మారుతోందన్నారు.

ప్రపంచంలో జరుగుతున్న మార్పుల గురించి ప్రభుత్వానికి తెలియదని రాహుల్ గాంధీ అన్నారు. మనం ప్రభుత్వ పాఠశాల స్థాయి నుండే బ్యాటరీలు, ఇంజిన్ల గురించి బోధించడం ప్రారంభించాలని సూచించారు. తయారీ రంగంలో చైనా మనకంటే 10 సంవత్సరాలు ముందుందన్నారు. చాలా సంస్థలు ఉత్పత్తులను పెంచడానికి ప్రయత్నం చేశాయని, కానీ తయారీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాయని అన్నారు. సామాజిక అశాంతి కూడా పెరిగిందని.. దీనిపై మోడీ సర్కార్ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ఉత్పత్తిలో చైనా మనకంటే ముందుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ కుల వ్యవస్థ బాగానే ఉందన్నారు. ఉత్పత్తి విప్లవంపై భారత్- అమెరికా మధ్య సహకారాన్ని సమర్థిస్తూనే.. అమెరికాలో ఉత్పత్తి మనం లేకుండా సాధ్యం కాదని కూడా ఆయన అన్నారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కుల గణన గురించి ప్రస్తావించిన ఆయన.. తెలంగాణలో 90 శాతం మంది ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలే ఉన్నారని అన్నారు. దేశంలో ఓబీసీ జనాభా 50 శాతం కంటే తక్కువ కాదని పేర్కొన్నారు.

తొక్కిసలాట ఘటనపై చర్చకు విపక్షాల పట్టు

ఇవాళ లోక్ సభ ప్రారంభం కాగానే మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ ఘటనపై కేంద్ర సర్కారు సమాధానం చెప్పాలని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లారు. తొక్కిసలాటలో మరణించిన వారి పేర్లను బయటపెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేయగా.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore