Search
Close this search box.

  తెలంగాణకు అవమానం! ‘పద్మ’ పురస్కారాలపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్..

January 27, 2025 1:00 PM | Aditya369 News

తెలంగాణకు అవమానం! ‘పద్మ’ పురస్కారాలపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్..

పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగువారిని అభినందిస్తూనే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని రేవంత్ అన్నారు.

ప్రజా గాయకుడు గద్దర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, రచయిత గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం ఐదు పురస్కారాలు కూడా ప్రకటించకపోవడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం.

మరోవైపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగ, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖికి పద్మ పురస్కారాలు రావడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి, అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 139 మందికి ఈ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ఎంపిక చేసింది. పద్మ అవార్డు అందకున్నవారిలో పలువురు తెలుగువారు కూడా ఉండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కింది. నందమూరి బాలకృష్ణకు కళల విభాగంలో పద్మభూషణ్ పుస్కారం లభించింది. తెలంగాణకు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)కి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore