కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా ఉద్యోగులకు నూతన పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ఇస్రోలో దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానంగా ఇస్రోలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 8వ పీఆర్సీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గ ఆమోద ముద్ర వేసింది.
కొంత కాలంగా 8వ పీఆర్సీ ఏర్పాటు కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు. ఈ కమిటీని ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. ఏపీలోని ఇస్రోకు కేంద్ర కేబినెట్ భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల నెక్స్ట్ జనరేషన్లాంచ్ వెహికిల్-ఎన్జీఎల్వీ ప్రయోగాలకు వీలు కల్పించే కొత్త లాంచ్ప్యాడ్నిర్మాణానికి ఆమోదం తెలిపారు. దీని ద్వారా రోదసీ పరిశోధన రంగానికి అవసరమయ్యే మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక మైలురాయిగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు.









