రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ గురించి ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరోసారి హీరోగా వెండితెరపై కనిపించలేదు ఈ మెగా హీరో. మధ్యలో తన తండ్రి హీరోగా నటించిన ‘ఆచార్య’లో చిన్న క్యామియోలో కనిపించాడు. కానీ ఆ సినిమా కూడా భారీ డిశాస్టర్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ నమ్మకమంతా ‘గేమ్ ఛేంజర్’పైనే ఉంది. ఫైనల్‌గా సంక్రాంతికి ఈ మూవీ బరిలోకి దిగడానికి సిద్ధమయ్యింది. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటికొచ్చింది.
బ్లాక్‌బస్టర్ పక్కా
‘గేమ్ ఛేంజర్’ సినిమా పక్కా హిట్ అని ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ దర్శకుడు శంకర్‌కు ఎన్నో ఏళ్లుగా సరైన హిట్ లేదు. భారీ బడ్జెట్‌తో చిత్రాలు తెరకెక్కించినా అవి వర్కవుట్ అవ్వకపోవడంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. అందుకే శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే ముందుగా ప్రేక్షకులు ఎగ్జైట్ అయినా.. అసలు ఫామ్‌లో లేని దర్శకుడితో చరణ్ సినిమా చేస్తున్నాడని కాస్త టెన్షన్ పడ్డారు కూడా. కానీ ‘గేమ్ ఛేంజర్’తో శంకర్ మళ్లీ ఫామ్‌లోకి రానున్నాడని తెలుస్తోంది. ఫస్ట్ రివ్యూలో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని తేలిపోయింది. అంతే కాకుండా ఈ మూవీలో హైలెట్స్ ఏంటనే విషయం కూడా బయటికొచ్చింది.
జంట బాగుంది
‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. ఒక కాలేజ్ స్టూడెంట్‌గా చరణ్ కనిపించినప్పుడు ఆ కాలేజ్‌లో వచ్చే సీన్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించింది. ఇందులో హీరో, హీరోయిన్‌క మధ్య లవ్ ట్రాక్ మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ కూడా యాడ్ చేశాడట శంకర్. అవి బాగా వర్కవుట్ అవుతాయని తెలుస్తోంది. రామ్ చరణ్ ఒక మాస్ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసి తన ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఏ సినిమాకు అయినా ఇంటర్వెల్ అనేది చాలా కీలకం. అలాగే ‘గేమ్ ఛేంజర్’లో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇంటర్వెల్ వేరే లెవెల్‌కు వెళ్లిపోయింది.
సెకండ్ హాఫ్ రచ్చ
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. కానీ అంతకు మించి సెకండ్ హాఫ్‌లోనే అసలు సినిమాలు ఉంటుంది. చాలా హై మూమెంట్స్ కూడా ఉంటాయి. మొత్తానికి టైటిల్‌కు తగినట్టుగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’గా మారి సినిమాను ముందుకు నడిపించాడు. చాలా సందర్భాల్లో తనది వన్ మ్యాన్ షో అన్నట్టుగా అనిపించడం ఖాయం. ఇక రామ్ చరణ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా తమ నటనతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయగా.. ఎస్ జే సూర్య గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమధ్యకాలంలో ఎస్ జే సూర్య ఏ సినిమా చేసినా గుర్తుండిపోయే పాత్రలోనే కనిపిస్తున్నాడు. ఆ లిస్ట్‌లో ‘గేమ్ ఛేంజర్’ కూడా యాడ్ అవుతుంది.