Search
Close this search box.

  జగన్ ప్యాలెస్‌లకు చెక్..?

వైసీపీ లగ్జరీ భవనాల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? కూటమి సర్కార్ తేల్చేదెప్పుడు? జిల్లాకో పార్టీ ఆఫీసు వ్యవహారం మాటేంటి? పెనాల్టీ వేస్తే కట్టేందుకు సిద్ధమేనని సంకేతాలు ఇచ్చిందా? ఫైన్‌తో సరిపెడుతుందా? పార్టీలకు ఇదే సహజమేనని లైట్‌గా తీసుకుంటుందా? అనేది వచ్చే నెలలో తేలనుంది.

 

2019-24 మధ్యకాలం వైసీపీ హయాంలో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ భూములను తీసుకుని విలాసవంతమైన పార్టీ ఆఫీసులను జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించింది. ఆయా భూముల విలువ అక్షరాలా 688 కోట్ల రూపాయలు. ఏడాది వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు తీసుకుని నిర్మాణం చేపట్టింది. వీటికి సంబందించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

 

26 జిల్లాల పార్టీ ఆఫీసుల నిర్మాణాలను రాంకీ గ్రూప్‌కి అప్పగించింది. తాడేపల్లిలో ఇరిగేషన్ డిపార్టుమెంట్‌కు చెందిన భూమిలో అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నియమించింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే దాన్ని కూల్చివేసింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ, హైకోర్టును ఆశ్రయించింది.

 

విచిత్రం ఏంటంటే నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు వైసీపీ. గతంలో టీడీపీ ప్రభుత్వ తీసుకొచ్చిన చట్టాన్ని ఉపయోగించుకుని లీజుకు తీసుకుంది. నిర్మాణాలు జరిగిన.. జరుగుతున్న వైసీపీ పార్టీ ఆఫీసులపై మే 18న 2022లో జీవోలు వచ్చింది ఆనాటి ప్రభుత్వం. ఒకే రోజు 25 జీవోలను తీసుకొచ్చింది.. వాటిని కూటమి సర్కార్ పబ్లిక్ డొమైన్‌లో పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

ఒక్కో జిల్లాలో ఎకరం, మరో దగ్గర రెండు ఎకరాలు ఇలా పార్టీ ఆఫీసులకు కేటాయించింది. ఎకరాకు కేవలం 1000 రూపాయలు చొప్పున 33 ఏళ్లకు లీజుకు తీసుకుంది. టీడీపీ అధికారంలో ఉప్పుడు 2016లో 371 జీవోని తీసుకొచ్చింది. దీని ప్రకారం పార్టీలకు భూములను కేటాయించవచ్చు.

 

తాడేపల్లిలో వైసీపీ ఆఫీసు కూల్చివేత తర్వాత హైకోర్టుకి వెళ్లింది. అధికారులు పరిశీలించిన తర్వాతే ఎన్ఓసీ ఇచ్చారని పేర్కొంది. ఆ తర్వాతే నిర్మించామని తెలిపింది. ప్లాన్ అప్రూవల్ కావాలంటే.. మున్సిపల్ చట్టంలో ఓ క్లాజ్‌ను ఉపయోగించుకుంది వైసీపీ. దీని ప్రకారం.. అనుమతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్ట్ కాకుంటే అప్రూవల్ వచ్చినట్టేనని తెలిపింది.

 

మొత్తం 26 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించామని, కూల్చడం వల్ల ఎవరికీ ఫలితం ఉండదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చట్టంలో ఉందని తెలిపింది. 33 శాతం వరకు పెనాల్టీ వేయవచ్చని చట్టంలో ఉన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ. పెనాల్టీ కట్టడానికి తాము సిద్ధమేనని ప్రస్తావించింది.

 

దీనిపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంది న్యాయస్థానం. ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారమే ప్రభుత్వం ఫాలో అవుతుందని ఏజీ చెప్పుకొచ్చారు. చట్టపరంగా వారికి నోటీసులు ఇవ్వాలని, రెండు వారాల్లో దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. ఇప్పుడు పార్టీ ఆఫీసులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది.

 

ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకు వైసీపీకి నోటీసులు ఇచ్చినట్టు లేదు.. రిప్లై ఇచ్చినట్టు అంతకంటే లేదు. పెనాల్టీ వేసి రెగ్యులర్ చేయాలనే ఆలోచన కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు