Search
Close this search box.

  వాలంటీర్ల వ్యవస్థ పై తేల్చేసిన ప్రభుత్వం..!

October 13, 2024 4:43 PM | Aditya369 News

వాలంటీర్ల వ్యవస్థ పై తేల్చేసిన ప్రభుత్వం..!

ఏపీ ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాల పైన ఫోకస్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అదే సమయంలో సూపర్ సిక్స్ హామీలు...కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు పైన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.

హామీల అమలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నెల 16 తేదీన సచివాలయంలో సమావేశం కానుంది. ఈ నెల 10 న జరగాల్సిన కేబినెట్ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతికి నివాళులు అర్పించిన అనంతరం వాయిదా పడింది. ఆ కేబినెట్లో చర్చించాల్సిన అంశాలు వాయిదా పడటంతో రాష్ట్ర మంత్రివర్గం 16వ తేదీన సమావేశం కానుంది. ఈ భేటీలో చెత్తపన్ను రద్దు, పీ - 4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటుగా నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ పని తీరు...హామీల అమలు పైన సమీక్ష చేయనున్నారు.

కీలక నిర్ణయాలు

కీలక అంశాల పైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, దేవాలయాల పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులకు తప్పనిసరిగా చోటు కల్పించడం తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలానే రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం.. పనుల ప్రారంభం పైన మంత్రివర్గం లో ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. అదే విధంగా.. పోలవరం కు కేటాయించిన నిధుల మేర పనులు ఈ ఆర్దిక సంవత్సరంలోనూ పూర్తి చేయాలనే షరతు నేపథ్యంలో మంత్రివర్గంలో చర్చించనున్నారు.

వాలంటీర్ల పై నిర్ణయం

ఇక, వాలంటీర్లు .. సచివాలయ వ్యవస్థ పైన ఈ సారి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాలంటీర్లకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వారికి విధుల కేటాయింపు విషయం లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుత విధులు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్న వారి విద్యార్హత ఆధారంగా వారి సేవలను వినియోగించుకోవాలని.. స్కిల్ ట్రైనింగ్ ఇప్పించాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. సచివాలయాల ప్రక్షాళన దిశగానూ ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. జనాభా ప్రాతిపదికన సచివాలయాలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి పైన ఈ సారి మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాల పైన ఫోకస్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అదే సమయంలో సూపర్ సిక్స్ హామీలు…కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు పైన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.

హామీల అమలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నెల 16 తేదీన సచివాలయంలో సమావేశం కానుంది. ఈ నెల 10 న జరగాల్సిన కేబినెట్ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతికి నివాళులు అర్పించిన అనంతరం వాయిదా పడింది. ఆ కేబినెట్లో చర్చించాల్సిన అంశాలు వాయిదా పడటంతో రాష్ట్ర మంత్రివర్గం 16వ తేదీన సమావేశం కానుంది. ఈ భేటీలో చెత్తపన్ను రద్దు, పీ – 4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటుగా నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ పని తీరు…హామీల అమలు పైన సమీక్ష చేయనున్నారు.

కీలక నిర్ణయాలు

కీలక అంశాల పైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, దేవాలయాల పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులకు తప్పనిసరిగా చోటు కల్పించడం తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలానే రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం.. పనుల ప్రారంభం పైన మంత్రివర్గం లో ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. అదే విధంగా.. పోలవరం కు కేటాయించిన నిధుల మేర పనులు ఈ ఆర్దిక సంవత్సరంలోనూ పూర్తి చేయాలనే షరతు నేపథ్యంలో మంత్రివర్గంలో చర్చించనున్నారు.

వాలంటీర్ల పై నిర్ణయం

ఇక, వాలంటీర్లు .. సచివాలయ వ్యవస్థ పైన ఈ సారి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాలంటీర్లకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వారికి విధుల కేటాయింపు విషయం లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుత విధులు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్న వారి విద్యార్హత ఆధారంగా వారి సేవలను వినియోగించుకోవాలని.. స్కిల్ ట్రైనింగ్ ఇప్పించాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. సచివాలయాల ప్రక్షాళన దిశగానూ ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. జనాభా ప్రాతిపదికన సచివాలయాలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి పైన ఈ సారి మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు