Search
Close this search box.

  బాబా సిద్ధిఖీని చంపింది మేమే… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు తామే కారణమని కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ హత్యకు తాము బాధ్యత వహిస్తోన్నట్లు వెల్లడించింది. దీనికి గల కారణాలను కూడా బయటపెట్టిందా గ్యాంగ్.

 

బాబా సిద్ధిక్ హత్యకేసులో ముంబై పోలీసులు హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కర్నాల్ సింగ్, ధరమ్ రాజ్ కశ్యప్‌‌ను అరెస్ట్ చేశారు. మరొకరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రమేయం ఉందంటూ పోలీసులు అనుమానిస్తోన్న వేళ.. తాజా ప్రకటన వెలువడింది.

 

హంతకులకు సుపారీ ఎవరిచ్చారు? ఆయుధాలు ఎక్కడి నుంచి అందాయి? వాటిని ఎవరు పంపించారు? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ప్రత్యేక బృందం ఈ ఉదయమే ముంబైకి చేరుకుంది. విచారణలో భాగస్వామ్యం అయింది.

 

ఈ పరిణామాల మధ్య లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన వెలుగులోకి వచ్చింది. సిద్ధికీ హత్యకు తామే బాధ్యత వహిస్తోన్నట్లు వెల్లడించింది. దీనిపై ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. జై శ్రీరామ్, జై భారత్ అనే పదాలతో ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది బిష్ణోయ్ గ్యాంగ్.

 

జీవితం విలువ మాకు బాగా తెలుసు. ప్రాణం, ధనాన్ని ధూళితో పరిగణిస్తాం.. అని రాసుకొచ్చింది. సల్మాన్ ఖాన్.. మేమీ యుద్ధాన్ని కోరుకోవట్లేదు. నువ్వు మా సోదరుడికి ప్రాణ నష్టాన్ని కలిగించావు. బాబా సిద్ధిక్ ఒకప్పుడు దావూద్‌ ఇబ్రహీంతో కలిసి మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా)ను ఎదుర్కొన్నాడు.. అని గుర్తు చేసింది.

 

బాబా సిద్ధికీ మరణానికి బాలీవుడ్, రాజకీయాలు, ఆస్తుల లావాదేవీల్లో సెటిల్మెంట్లు, దావూద్ ఇబ్రహీం, అనూజ్ థాపన్‌లకు ఉన్న సంబంధాలే కారణమని తేల్చి చెప్పింది. తమకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదని, సల్మాన్ ఖాన్‌ లేదా దావూద్ గ్యాంగ్‌కు సహాయం చేసే వారెవరైనా ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ఈ గ్యాంగ్ హెచ్చరించింది.

 

సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీం వల్ల తమ గ్యాంగ్‌లో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించినా మేము ఖచ్చితంగా ప్రతి స్పందిస్తాం. జై శ్రీ రామ్, జై భారత్, అమరవీరులకు సలాం..అంటూ రాసింది బిష్ణోయ్ గ్యాంగ్.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు