Search
Close this search box.

  మంత్రివర్గ భేటీ – రైతుభరోసా, వరద సాయంపై కీలక నిర్ణయాలు..!

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాల ఆమోదానికి సిద్దమైంది. తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి పెండింగ్ లో ఉన్న పలు ప్రధాన అంశాలకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అదే విధంగా రైతు భరోసాతో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట పరిహారం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హైడ్రా బలోపేతం పైన నిర్ణయం తీసుకోనున్నారు.

 

కేబినెట్ లో చర్చ

తెలంగాణ మంత్రివర్గం నేటి సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చ చేయనుంది. తాజా వరదల కారణంగా భారీ నష్టం చోటు చేసుకుంది. ఇప్పటికే కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పరిశీలన చేసింది. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు, ధ్వంసమైన రహదారులు తిరిగి నిర్మించేందుకు, పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగించుడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. బాధిత ప్రాంతాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లనుంది.

 

రైతుబంధు పై నిర్ణయం

రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. దీనిని చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి 200 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు ప్రతిపక్షాలు కేబినెట్ సమావేశంపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, హామీల అమలుపై చర్చ జరగనుంది. వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో, రైతుల భరోసా పథకం అమలు కావడంపై కూడా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంది.

 

వదర బాధితుల కోసం

వీటితోపాటు ఆరోగ్య భీమా, రేషన్ కార్డులు, గ్రామ పంచాయతీలు ప్రభుత్వం పేదలందరికీ ఆరోగ్య బీమా అందించాలన్న ప్రతిపాదనపై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. మూడు విశ్వవిద్యాలయాల పేర్లను మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇందుకు మంత్రి మండలి ఆమోదం కూడా ఉండాల్సి ఉండడంతో ఇవాళ ఆ మూడింటి గురించి చర్చించనుంది. హైడ్రాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

నేటి సమావేశంలో ఈ మేరకు చర్చించి ఇతర శాఖల నుంచి సిబ్బంది కేటాయింపుతో పాటుగా కొత్తగా అధికారాలపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు