Search
Close this search box.

  ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇసుక

నూతన ఉచిత ఇసుక విధానం అమలులో భాగంగా వినియోగదారు లు ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మరింత సౌలభ్యంతో ఇసుక పొందేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ సాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ను రాష్ట్ర ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం అమరావతి నుండి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంఎల్సీ కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, గనుల శాఖ డిడి ఈ.నర్సింహారెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు పారదర్శకంగా, త్వరితగతిన ఇసుక అందించేందుకు ఈ యూజర్ ఫ్రెండ్లీ ఆన్ లైన్ పోర్టల్ దోహదం చేయగలదని తెలిపారు. ప్రజల అవసరాల మేరకు ఇసుక వనరులను అందుబాటులోకి తేవడంతో బాటు, ఇసుక తవ్వకం, రవాణ చార్జీలను వీలైనంత కనిష్ట స్థాయికి నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.అలాగే జిపిఎస్ ట్రాకింగ్,సిసి కెమేరాలు,డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో ఇసుక అక్రమాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. ఇసుక బుకింగ్ కు సంబంధించి వినియోగదారులకు సమాచారం అందించడం, సందేహాల నివృత్తి చేయడం కొసం రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని, అదే తరహాలో జిల్లా స్థాయిలో వినియోగదారుల కొరకు ఫెసిలిటేషన్ కేంద్రాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో బాటు రాష్ట్ర ఎక్సైజ్, గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా స్థాయి శాండ్ కమిటీ వినియోగదారుల సమాచారం, ఇసుక రవాణా వాహనదారులకు సూచనలు తదితర అంశాలతో ప్రచురించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం, ఆన్ లైన్ సాండ్ బుకింగ్ పోర్టల్ సేవల గురించి విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారుల ను ఆదేశించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు