కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లోని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం మండలం మాధవపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు. మాజీ ఎంపీ వంగా గీత, వైసిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
