కాకినాడ జిల్లాలో ఏలేరు ముంపు ప్రభావం వల్ల దెబ్బతిన్న గ్రామాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం ఆయన పిఠాపురం ఆర్ ఆర్‌బిహెచ్ ఆర్ క్రీడా స్థలంలో హెలికాఫ్టర్‌లో దిగుతారు. అక్కడ నుండి నేరుగా పాత ఇసుకపల్లిమీదుగా, మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట ప్రాంతాల్లో ముంపు పరిస్థితిని పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడతారు. వైసీపీ శ్రేణులు హాజరుకావాలని మాజీ ఎంపీ వంగా గీత పిలుపునిచ్చారు.
