పిఠాపురం ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు.ఏలేరు రిజర్వాయర్ లో వరద నీరు 21 టీఎంసీ లు నిండికుందని తెలిపారు. పిఠాపురం టిడిపి కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో ఏలేరు వరద పరిస్థితిపై సమీక్షించారు. గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ, నక్కలగండి, గొర్రిఖండి, శివాలయం మాన్యం, కంకరరావళ్ళు, ఈబిసి కాలనీ పరివాహక ప్రాంతవాసులు జాగ్రత్తలు పాటించాలన్నారు. టిడిపి కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.
