ఈ నెల 9వ తేది సోమవారం కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు
