కాకినాడ జిల్లా పిఠాపురంలో నూతనంగా నిర్మించిన కోర్టును వర్చువల్ విధానం ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రారంభిం చారు. అనంతరం కోర్టు హాలు, ఇతర గదులను తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గంధం సునీత ప్రారంభించారు. 12వ అదనపు జిల్లా జడ్జి వాసంతి, జడ్జిలు బాబు విజయరామేశ్వరి, వెంకట అపర్ణ,బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగు రాజారావు, న్యాయవాదులు పాల్గొన్నారు.









