రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎక్కడికికక్కడ రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ 20 వేల మొక్కలు పంపిణీ చేశారు. ఆసుపత్రు లలో రోగులకు పండ్లు అందించారు. కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పిఠాపురంలో భారీ కేక్ కట్ చేశారు.
