రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు ఉందని చెప్పారు. ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, 37 సెం.మీ వరకు వర్షం కురిసిందని సీఎం తెలిపారు.
