బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల నుంచి పుననరావాసాలకు వెళ్లాలని హెచ్చరించింది.
