కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై, అధికారుల వ్యవహార శైలి పైన మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్డి నాగ నరసింహారావుకు వివరించారు. మున్సిపాలిటీలో అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, పనులు జరగడం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక విషయంలో కూడా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆర్డి కి వివరించారు. కమిషనర్,డిఈ వివాదంపై సమగ్ర విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఆర్డి వారికి తెలిపారు.
