ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాకినాడ జిల్లాలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ,ఎయిడెడ్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ షాన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం జరగాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 6 కు వాయిదా వేశారు. ఈ మేరకు అన్ని మండలాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
