రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న సామాజిక పెన్షన్లు పంపిణీ లో టిడిపి కార్యకర్తలు ప్రజలకు సహకరించేందుకు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు ముందే, అంటే 31 వ తేదీన పెన్షన్లు అందించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
