అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో తాబేళ్లు స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. అమలాపురం నుండి ఒడిస్సా రాష్ట్రానికి తరలిస్తున్న 278 తాబేళ్లను ఫారెస్ట్ అధికారులు మోతుగూడెం వద్ద పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న ఇద్దరిపై 1972 వన్యప్రాణి చట్టం కింద నమోదు చేశారు. పట్టుకున్న తాబేళ్లలో 32 చనిపోయి ఉన్నాయి. మిగిలిన వాటిని అడవిలో వదిలిపెట్టారు.
