కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రం బాలా త్రిపుర సుందరి సమేత చాళుక్యకుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస చివరి శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. ఈవో బల్ల నీలకంఠం పూజ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందించారు.
