విద్యార్థులు శాస్ర్తవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం అందిస్తామని, తనను కలిసిన రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గి కోర్సకొవ్, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ అన్నారు. వారు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి పవన్ కు వివరించారు. రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జి ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో డా. కేశన్ పవన్ ను కోరారు.
