ఇంటిలో తమ్ముడినే బాగా చూస్తున్నారని, తనపై చదవమని ఒత్తిడి చేస్తున్నారని ఇంటి నుండి పారిపోయి హడావుడి సృష్టించిన బాలుడు, పోలీసుల సహకారంతో తిరిగి ఇంటికి చేరాడు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామానికి చెందిన బత్తిన శ్రీరామ్(13) తన కంటే తమ్ముడినే బాగా చూస్తున్నారని అలిగి ఇంటి నుండి పారిపోయాడు. ఎట్టకేలకు విశాఖపట్నంలో దొరకడంతో తండ్రి శివనారాయణకు పోలీసులు అప్పగించారు.
