దేశవ్యాప్తంగా టెన్త్ , ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 65 లక్షల పైనే ఉందని కేంద్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో రాష్ట్రాల బోర్డులకు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేశారు. 33.5 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు, 32.4 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పదో తరగతిలో మధ్యప్రదేశ్, ఇంటర్మీడియట్లో ఉత్తర ప్రదేశ్ ఫెయిల్ అవ్వడంలో మొదటి స్థానం దక్కించుకున్నాయి.
