కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న శాశ్వత నీటి నిల్వలను గుర్తించి, వాటిలో దోమలు గుడ్లు పెట్టకుండా నివారణకు గంబుసియా చేపలను విడుదల చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరసింహ నాయక్, జిల్లా మలేరియా శాఖ అధికారి భాస్కరరావు చేపలు నీటిలో విడుదల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. గంబూసియా చేపలను శాశ్వత మంచినీటి నిల్వలలో విడుదల చేయుట ద్వారా, దోమ గుడ్లను గంబూసియా చేపలు ఆహారంగా తీసుకొంటాయి.
