కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కొమరగిరి గ్రామంలో గత ప్రభుత్వంలో సేకరించిన ఇళ్లపట్టాలో భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా కలెక్టర్ కు, మత్స్య కారులతో కలిసి వినత పత్రం అందజేశారు స్థానిక మత్స్య కారులకు ఇండ్లపట్టాలు ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వివరించారు. గతంలో జరిగిన ఇండ్ల స్థలాల విషయంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాత్ర పైన విచారణ జరపాలని వర్మ కోరారు.
