ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 7 ఎయిర్ పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఏడింటిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తు న్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలు పెంచుతున్నాం అని అన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో ఎయిరోపోర్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
