పంద్రాగష్టును పురస్కరించుకుని ఏపీ గవర్నర్ అబ్దుల్ నబీ విజయవాడ రాజ్భవన్లో తేనేటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, పలుపార్టీల అధ్యక్షులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. నారా లోకేష్ మంత్రులను గవర్నర్కు పరిచయం చేశారు. చంద్రబాబు, పవన్ గవర్నర్ కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
