78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీనుద్ధేశించి ఆమె ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్యమన్నారు. కేంద్ర మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ ఉంటుందని ముర్ము అన్నారు.మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, జీ- 20 సదస్సును విజయవంతం చేశార న్నారు. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందన్నారు. రైతుల వల్లే దేశం సుభిక్షంగా ఉందన్నారు.
