Search
Close this search box.

  మాస్టర్ అని వచ్చాడు .. బాలికలతో మస్కా కొట్టాడు

August 10, 2024 1:24 PM | Aditya369 News

మాస్టర్ అని వచ్చాడు .. బాలికలతో మస్కా కొట్టాడు

తానోక టీచర్ ను అని చెప్పి, ట్యూషన్ మాస్టర్ గా వచ్చి ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన ఉదంతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ పురోగతి లేకపోవడంతో, బాలికల తల్లి సునీత , నాయకుల చుట్టూ తిరుగుతుంది. తాజాగా ఆమె పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి సమస్య విన్నవించుకుంది. దీంతో వర్మ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తో ఫోన్లో మాట్లాడి బాలికలను కాపాడాలని కోరారు. మారోజు వెంకటేష్ అనే యువకుడు ట్యూషన్ టీచర్ గా తమ వద్దకు వచ్చి బాలికలను ట్రాప్ చేసి కిడ్నాప్ చేశాడని తల్లి సునీత ఆరోపిస్తోంది. పోలీసులు పట్టించుకోవడంలేదని, తన పిల్లలను కాపాడాలని వేడుకుంటుంది. నారా లోకేష్ చొరవ తీసుకుని తన కూతుర్లను కాపాడాలని ఆమె కన్నీటి పర్యంతమవుతుంది

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు