Search
Close this search box.

  మరోసారి చైతూ పెళ్లిపై వేణు స్వామి అనుచిత వ్యాఖ్యలు..!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సెలబ్రిటీల జ్యోతిష్కుడు వేణుస్వామి జాతకాలు ఈ మధ్య తరచుగా తలకిందులవుతున్నాయి. అయినా తగ్గేదే లేదంటున్నాడు వేణుస్వామి. అటు రాజకీయ నాయకులు, ఇటు సినిమా తారలూ వాళ్లు అడగకపోయినా వాళ్ల జాతకాలు చెప్పుకుని తనకి తానే ఓ సెలబ్రిటీ జ్యోతిష్కుడుగా చెలామణి అవుతుంటాడు ఆయన. అప్పుడెప్పుడో సమంత, నాగచైతన్యలు విడిపోతారని ఈయనగారు చెప్పిన జాతకం నిజం కావడంతో ఇక ఈయన రెచ్చిపోయి జాతకాలు చెప్పేయడం ఆరంభించాడు. మొన్నటికి మొన్న ప్రభాస్ పని ఇక అయిపోయిందని.. ఆయన సినిమాలు హిట్టు కావని జోస్యం చెప్పాడు. కల్కి మూవీ హిట్ తో వేణుస్వామి జాతకం తప్పని తేలిపోయింది.

అన్నీ తప్పుడు జాతకాలే

ఇక మొన్నటి ఎన్నికల సమయంలోనూ ఏపీలో రాబోయేది మళ్లీ జగన్ ప్రభుత్వమేనంటూ అడ్డగోలుగా జాతకం చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ కు ఈ సారి కూడా ఓటమి తప్పదని ఆయన రాజకీయంగా ఎదగడం కష్టమని వివాదాస్పద జాతకాలు చెప్పి మరోసారి భంగపడ్డాడు. జనం నుంచి విపరీతంగా ట్రోలింగ్స్ రావడం చూసి ఇక తాను ఏ ఒక్కరికీ జాతకాలు చెప్పనని.. ఆయనపై నమ్మకం ఉంచి వచ్చేవారికి తప్ప అడగకుండా ఏ ఒక్కరి జాతకాలు చెప్పబోనని ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. కొద్దిగా మాత్రమే గ్యాప్ ఇచ్చాడు.. మళ్లీ విజృంభించాడు. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే ఆమె కూడా తన భర్తకు విడాకులు ఇవ్వబోతోందని చెప్పేశాడు.

నాగచైతన్యను టార్గెట్ చేశాడా?

ఎంగేజ్ మెంట్ పేరుతో చైతన్య, శోభిత ఒక్కటయ్యారు. వేణుస్వామి నాగచైతన్య పెళ్లిని టార్గెట్ చేశాడో ఏమో గానీ మరోసారి తనదైన శైలిలో వీరి జాతకాలు చెప్పాడు. నాగచైతన్య, శోభితలు ఎంగేజ్ మెంట్ పేరుతో ఒక్కటైన సమయం దుర్ముహూర్తం ఉందని.. అవేమీ పాటించకుండా ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. పైగా వీరిద్దరి జాతకాలు కూడా ఏమీ బాగోలేదని అంటున్నారు. ఆ జాతకాల ఆధారంగా వీరిద్దరి కాపురంలో కలతలు వచ్చే అవకాశం ఉందని వీరి జంట కూడా త్వరలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాడు వేణుస్వామి. తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా వేణుస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వేణుస్వామి వ్యాఖ్యలు తప్పుపడుతున్న అభిమానులు మాత్రం వేణుస్వామి ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని.. ఆయన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పని లేదని కామెంట్స్ చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు