కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసిపి పార్టీని వీడినట్లు ప్రకటించారు.పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, గత ఎన్నికల ముందు గడపగడపకు ప్రచారంలో తానే ముందున్నా నని ఆయన వెల్లడించారు. వైసిపి నుండి తనకు ఎటువంటి గుర్తింపు రాలేదని, కనీసం ఎన్నికల్లో తనను ప్రచారం చేయమని కూడా అడగకపోవడం బాధాకరమన్నారు కార్యకర్తల అభీష్టం మేరకు వైసీపీని వీడుతున్నట్లు దొరబాబు ప్రకటించారు. ఇప్పటికే కూటమినేతలు తనతో టచ్ లో ఉన్నట్టు చెప్పిన దొరబాబు త్వరలో కూటమిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇది తన రాజకీయ స్వలాభం కోసం కాదని కార్యకర్తల అభీష్టం మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఒక ఆకాంక్షతో తాను పార్టీ మారుతున్నట్లు దొరబాబు స్పష్టం చేశారు ఏ పదవి ఆశించడం లేదని కార్యకర్తలను తన అను చరుల కోసం, పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలన్న ఒకే ఒక ఆకాంక్షతో వైసీపీ నుండి వీడి కూటమిలోకి చేరుతున్నట్లు దొరబాబు తెలిపారు. త్వరలో కూటమిలోకి చేరే తేదీని ప్రకటిస్తామన్నారు.
