జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక కాకినాడ జిల్లా పిఠాపురంలో సందడి చేశారు.నిహారిక ప్రొడక్షన్ లో
కమిటీ కుర్రాళ్ళు మూవీ చిత్రం యూనిట్ పర్యటనలో భాగంగా పిఠాపురంలో పాదగయ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఆలయ ఈవో దుర్గ భవాని నిహారిక బృందానికి ఆలయ మర్యాదలు చేశారు. అనంతరం నిహారిక పవన్ కళ్యాణ్ నివాసమైన చేబ్రోలు వెళ్లారు. కమిటీ కుర్రాళ్ళు చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.
