కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం నుండి తంటికొండ వెంకటేశ్వరస్వామీ ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం కోసం చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొవడం తాను అదృష్టంగా భావిస్తు న్నానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. జగ్గంపేట ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూతో కలిసి ,తంటికొండ వెంకటేశ్వరస్వామీ ఆలయంలో విశేష పూజలు నిర్వహించాను. వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానించి, అర్చన, తీర్ద ప్రసాదం అందజేశారు. స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా మొట్ట మొదటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీసీ రోడ్డును శంకు స్థాపన చేయడం నాఅదృష్టంగా భావిస్తున్నాను..అని,అయ్యన్న సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు.
