రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక విధానం- 2024 ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు నిర్వహించాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారుల ఆదేశించారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు ఇసుక స్టాక్ యార్డును జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తో కలిసి ఆయన సందర్శించారు. ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందిన ఫిర్యాదులపై, స్టాక్ యార్డ్ సిబ్బంది, లారీ డ్రైవర్లు, వినియోగదారులను మీనా విచారించారు
