బాలింతలు బిడ్డలకు పాలివ్వకుంటే భవిష్యత్తులో గర్భాశయ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్ బి.జయరామ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాలు పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరానగర్ యుపీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ చేశారు. తల్లిపాల విలువను చాటారు. చిన్న పిల్లల తల్లులు పాలివ్వడంలో తలెత్తే సమస్యలను వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 7 వరకు వారోత్సవాలు జరగనున్నాయి.
