పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం ఎంపీ కార్యాలయం నుంచి నోట్‌ను విడుదల చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా మొత్తం 19 మంది పేర్లను పరిశీలించారు. అందులో 15 మందిని కమిటీ సభ్యులను ఎన్నుకోగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలిస్తుంది.
