కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలోని కొలువైన పురుహూతికా అమ్మవారికి
పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన భక్తులు సారె సమర్పించారు. 8 కిలోమీటర్లు నడిచి అమ్మవారికి పెద్ద ఎత్తున పండ్లు, పూలు, పలహారాలతోపాటు, చీరలు, రవికెలు ఆషాడ మాస సారెను అందించారు. పాదగయ ఆలయ ఈవో దుర్గాభవానీ దేవాదాయశాఖ తరుపున స్వాగతం పలికారు. భక్తులకు దర్శనం, ప్రసాద వితరణ చేశారు.
