ఉమ్మడి విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ నుండి వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి చేరడంతో అప్పట్లో అనర్హత వేటు పడింది. ఈస్థానానికి తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు,14న పరిశీలన, 16న ఉపసంహరణ, 30న ఎన్నిక జరగనుంది. ఉమ్మడి విశాఖజిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు కలిపి 720 ఓటర్లున్నారు.
