తనకు రక్షణ కల్పించాలని కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధికారులను కోరారు. ఎప్పుడూ ఎవరి విషయంలోనూ తప్పుగా ప్రవర్తించలేదన్నారు. అలాంటిది తనపై అటాక్ జరిగిందని ఆరోపించారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేశామన్నారు. ప్రత్యర్థి పార్టీ అయితే బెదిరిస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. గుర్తు తెలియని ఓ యువకుడు ఆమె ఇంటి వద్దకు వద్దకువచ్చి దాడి చేసాడని ఆమె ఆరోపించారు.అధికారం ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలని గాని, దాడులు చేయడం సరికాదన్నారు. పెద్దాపురం వైసీపీ ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు, వైసీపీనేత సాయి, తనకు ఆపద అనగానే నిమిషాల్లో వచ్చారని, పార్టీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉందనడానికి ఇది నిదర్శనమన్నారు. తనపై దాడికి ప్రయత్నించిన వారిపై చట్ట పర చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
