కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా మేనకొడలు విన్నపాల చంద్రలేఖ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న వీధిలో ఉన్న చంద్రలేఖ ఇంటికి పత్రాలు సృష్టించి, ఖాళీ చేయించాలని దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. దీనిపై న్యాయపోరాటానికి కూటమి అండగా ఉంటుందన్నారు. దశబ్ధాలుగా ఇక్కడే స్థిర నివాసమై ఉంటున్న చంద్రలేఖ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
